
నో... గాసిప్స్
తెలుగు కథానాయికల రెమ్యునరేషన్‌ను కోటికి ఎగబాగించిన తార ఎవరు? అని అడిగితే ఇలియానా అని ముందుగా చెబుతారు. చేసిన ప్రతి చిత్రంలోనూ తనదైన చెమక్కులతో.. హుషారుగొలిపే పాత్రల్లో చేసి కుర్రకారుని తనవైపు తిప్పుకుంది. అయస్కాంతానికి కూడాలేని వయస్కాంతంతో యూత్ ని మెలికలు తిప్పిస్తున్న ఇలియానా గాసిప్స్‌కి దూరంగా ఉండటం ఓ విశేషంగా చెప్పచ్చు. దానికి కారణం ఆమె తీరిక సమయాల్ని తనదైన పద్దతిలో ఉపయోగించుకోవడమేనట. ఎక్కువగా ఇలియానా ఫ్రెండ్స్‌తో కాలేక్షేపం చేస్తుంది. తన భావజాలాలను వారితోనే ఎక్కువగా షేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆమెకు పెయింటింగ్స్ వేయడం అంటే సరదా. తన అంతరంగంలో గూడుకట్టుకున్న భావాల్ని అందమైన కాన్వస్‌పై మరింత అందంగా కలర్స్‌తో పలికించగల ‘హార్టిస్టు’ ఇలియానా. మరోవిశేషం ఏమిటంటే చేతిలో ఎప్పడూ ఏదో ఒక పుస్తకం ఉండాల్పిందేనట. ఎక్కువగా ఆమె షిడ్నీ షెల్డాన్ పుస్తకాల్ని చదువుతుందట. ఇన్ని వ్యాపకాలతో సమయాన్ని క్షణం తీరక లేకుండా గడిపే ఇలియానా ఇక గాసిప్స్‌కు ఎక్కడ అవకాశం ఇస్తుంది చెప్పండి!
- విజయానందంలో తకిట తకిట
- నా పేరే రగడ
- చివరి షెడ్యూల్లో డైనమిక్
- హృదయం ఆగిపోయింది
- హాస్యోత్సవం
- సంగీతమే నాకు సమస్తం
- ఈనెలలోనే రానున్న రోబో
- నేనే అంబానీ (ఆరు నెలల్లో)
- ఫైర్ ఇంజన్
- నేల విడిచి సాము చేయకపోవడమే నిర్మాతగా నా విజయ రహస్యం !
- టాలీవుడ్‌కి టాటా చెబుతారా ?
- 12న బృందావనం పాటలు
- వారెవా లోగో ఆవిష్కరణ
- బహుముఖ ప్రజ్ఞాతి.. భానుమతి
- విజువల్ అద్భుతం పిరానా 3డి


























































