Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Tollywood >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
19 న వస్తున్న లీడర్‌

Ledarప్రముఖ నిర్మాత డా. డి.రామానాయుడు మనవడు, సురేష్‌బాబు తనయుడు రానా (రామానాయుడు) హీరోగా శేర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లీడర్‌’ చిత్రం ఫిబ్రవరి 11న విడుదలకావలసి ఉంది. అయితే తమ చిత్రాన్ని కొన్ని కారణాల చేత ఈ నెల 19న విడుదలకు వాయిదా వేసామని నిర్మాత తెలిపారు. హీరో రానా మాట్లాడుతూ ‘‘నేను సినిమాలు చూస్తూ పెరిగిన వాడ్ని. బాబాయ్‌ దగ్గర నేను ఆర్టిస్టును కావాలని చెప్పినపుడు కొన్ని టిప్స్‌ చెప్పారు. అవి నాకెంతగానో ఉపయోగపడ్డాయి.

‘లీడర్‌’ రషెస్‌ చూసి తన ఆనందాన్ని వ్యక్తపరచారు బాబాయ్‌. తొలి సినిమాకే ఆయననుండి మంచి కాంప్లిమెంట్‌ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది’’అన్నారు. ఈ చిత్రాన్ని వైజాగ్‌, సీడెడ్‌ మినహా మిగిలిన రాష్టమ్రంతా గీతా ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది. మిక్కీ జె మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏవీయం ప్రొడక్షన్స్‌ 174వ చిత్రంగా రూపొందుతుండటం విశేషం. ఈ ‘లీడర్‌’లో రాణా దగ్గుబాటి సరసన రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్‌ హీరోయిన్లుగా నటించగా.. కోట శ్రీనివాసరావు, సుహాసిని, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ఆహుతి ప్రసాద్‌, గొల్లపూడి మారుతీరావు, సుమన్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఒక్క సెన్సార్‌ కట్‌ కూడా లేకుండా ‘యు’ సర్టిఫికేట్‌తో ఫిబ్రవరి 19న మనముందుకు రాబోతున్నాడు ‘లీడర్‌’ .

Other News From Tollywood
SURYA Specials |
Weekly Specials |
Advertisement434
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us