
వేసవిలో వేటాడటానికి వస్తున్న సింహా
నందమూరి బాలకృష్ణతో యువ నిర్మాత పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ‘సింహా’ ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, స్నేహ ఉల్లాల్, నమిత హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత ఈ సినిమా గురించి చెబుతూ ‘‘బాలయ్యబాబు లుక్స్‌గాని, బాడీలాంగ్వేజ్‌గాని చాలా విభిన్నంగా ఉంటుంది. రామ్ లక్ష్మణ్‌లు ఫైట్స్‌ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. అలాగే ఆర్దర్ ఎ విల్సన్ ఫొటోగ్రఫీ కూడా ఎక్స్‌లెంట్‌గా ఉంటుంది.
హీరోయిన్స్ నయినతార, స్నేహావుల్లాల్, నమితలకు బాలయ్యబాబుతో రెండేసి పాటలు ఉంటాయి. అన్నిహంగులతో తయారవుతున్న ఈ చిత్రం సమ్మర్‌స్పెషల్‌గా విడుదలకు సిద్దమవుతోంది’’అని చెప్పారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘భధ్ర, తులసి, చిత్రాలు తర్వాత చేస్తున్న ఈ చిత్రం నాకు హ్యాట్రిక్ చిత్రమవుతుంది. బాలయ్యబాబుతో ఓ మంచి కమర్షియల్ హిట్ చిత్రం చేస్తున్నానన్న నమ్మకం నాకు ఉంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు’’ అని అన్నారు.
- విజయానందంలో తకిట తకిట
- నా పేరే రగడ
- చివరి షెడ్యూల్లో డైనమిక్
- హృదయం ఆగిపోయింది
- హాస్యోత్సవం
- సంగీతమే నాకు సమస్తం
- ఈనెలలోనే రానున్న రోబో
- నేనే అంబానీ (ఆరు నెలల్లో)
- ఫైర్ ఇంజన్
- నేల విడిచి సాము చేయకపోవడమే నిర్మాతగా నా విజయ రహస్యం !
- టాలీవుడ్‌కి టాటా చెబుతారా ?
- 12న బృందావనం పాటలు
- వారెవా లోగో ఆవిష్కరణ
- బహుముఖ ప్రజ్ఞాతి.. భానుమతి
- విజువల్ అద్భుతం పిరానా 3డి


























































