Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Tollywood >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
చివరి షెడ్యూల్లో యంగ్‌ ఇండియా

Dasariడా. దాసరి దర్శత్వంలో నూతన తారాగణంతో రూపొందుతున్న ‘యంగ్‌ ఇండియా’ చిత్రం ఫిబ్రవరి 8నుంచి రామోజీ ఫిలిం సిటీలో చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. సిరి మీడియాప్రై.లిమిటెడ్‌ పతాకంపై రామకృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ శ్రీమతి దాసరి పద్మ. ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ ‘‘ఒక సంచలనమైన కథతో డా.దాసరి నారాయణరావు గారు ఈ చిత్రాన్ని అంతా కొత్తవారితో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ ఫిబ్రవరి 8న రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌ 22వరకు జరుగుతుంది. దాంతో దాదాపు షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది.

కీరవాణి స్వరపరచిన 6పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా వున్నాయి. ఈ చిత్రం ద్వారా మేం పరిచయం చేస్తున్న నటీనటుల్లో కనీసం 10మంది స్టార్స్‌ అవుతారన్న నమ్మకం వుంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, ఛాయాగ్రహణం: సిహెచ్‌.రమణరాజు, ఎడిటర్‌: గౌతంరాజు, కళ: బి.వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: జె.జగదీశ్వర ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి దాసరి పద్మ, నిర్మాత: రామకృష్ణ ప్రసాద్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డా.దాసరి నారాయణరావు.

Other News From Tollywood
SURYA Specials |
Weekly Specials |
Advertisement483
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us