Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Tollywood >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
హ్యపీ బర్త్‌డే

sumanthడా.అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు సుమంత్‌ రామ్‌ గోపాల్‌ వర్మ నిర్ధేశకత్వంలో రూపొందిన ‘ప్రేమకథ’ చిత్రం ద్వారా 1999లో హీరోగా తెరంగేట్రం చేసారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించనప్పటికీ నటుడుగా సుమంత్‌ ప్రసంశలందుకున్నారు. ఆ తరువాత ఆయన అనేక చిత్రాల్లో హీరోగా నటించారు. డా.అక్కినేని నటవారసత్వం నుండి వచ్చిన సుమంత్‌ కు తన టాలెంట్‌కు తగ్గ చిత్రం ఇంతవరకూ రాలేదనే చెప్పాలి. ‘స్నేహమంటే ఇదేరా, మధుమాసం, గోదావరి’ లాంటి చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఆయన నటించారు. వాటిలో ‘గోదావరి’ చిత్రం మంచి విజయం సాధించింది. సుమంత్‌ కథానాయకుడుగా నటించిన ‘బోణి’ చిత్రం గత సంవత్సరం విడుదలైంది. అమెరికాలో దర్శకత్వ శాఖలో శిక్షణ పొందిన సుమంత్‌ ఆనక హీరోగా వెండితెర యానం ప్రారంభించారు. ఫిబ్రవరి 9న సుమంత్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ‘సూర్య సినిమా’ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

Other News From Tollywood
SURYA Specials |
Weekly Specials |
Advertisement396
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us